బీఈడీ, స్పెషల్ బీఈడీ ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించి బీఈడీ, స్పెషల్ బీఈడీ రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. ఉపకులపతి ఆచార్య కె.రాంజీ ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామని చెప్పారు. 1351 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 71.13 శాతంతో 961 మంది, స్పెషల్ బీఈడీ –2 సెమిస్టర్‌లో 66 మంది పరీక్షకు హాజరుకాగా 84.85 శాతంతో 56 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పునఃమూల్యాంఖనం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు నవంబరు 4వ తేదీలోగా వెబ్‌సైట్‌లో సూచించిన రుసుము చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
పెడన:మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాథమిక పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న స్కూలు భవనం కూలిపోయింది. వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు జిల్లా వ్యాప్తంగా సెలవు మంజూరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే వాదన గ్రామస్తులు నుంచి వ్యక్తమవుతుంది. ఇటువంటి వాటిని తక్షణం తొలగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి వెళ్లి ఉంటే పరిస్థితి ఏమిటనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారు.


