క్రీడలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి
విజయవాడరూరల్:క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని రాష్ట్ర ఎంఈఓల సంఘం అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, సమగ్ర శిక్ష, ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నున్న జిల్లా పరిషత్ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన రెజ్లింగ్ అండర్–19 పోటీలు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షుడు, విజయవాడ రూరల్ ఎంఈఓ ఎ.వెంకటరత్నం రెజ్లింగ్ పోటీల్లో గెలుపొందిన నెల్లూరు జిల్లా జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీలను, వ్యక్తిగత విజేతలకు పతకాలు అందచేశారు.
ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నెల్లూరు జట్టు....
నెల్లూరు జిల్లా క్రీడాకారులు ఈ టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫ్రీస్టైల్ విభాగంలో ఆ జట్టు నాలుగు బంగారు పతకాలను రెండు రజత పతకాలను గెలుచుకోవడం ద్వారా 26 పాయింట్లు సాధించింది. గ్రీకో రోమన్ విభాగంలో మూడు బంగారు పతకాలు, మూడు కాంస్య పతకాలతో 18 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో నున్న జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఎస్.రవిప్రసాద్, ఎస్‌ఎంసీ చైర్మన్ జి.కుమార్, ఏపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.భూషణం, సీహెచ్ రమేష్, పి.ఆనంద్, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి టి.శ్రీలత, ఫిజికల్ డైరెక్టర్లు టి.విజయవర్మ, ఎంవీ సత్యప్రసాద్, ఎస్.రమేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఎంఈఓల సంఘం అధ్యక్షుడు ఆదూరి


