
దుర్గగుడికి పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. భవానీపురానికి చెందిన కేసరి శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి తమ కుమార్తె నీవిద, తల్లిదండ్రులు సుబ్బారెడ్డి, రాజేశ్వరిల పేరిట నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ ఏఈవో ఎన్. రమేష్‌బాబుకు అందజేశారు.
ఉచిత ప్రసాదం పథకానికి..
అమ్మవారి సన్నిధిలో ప్రతి నిత్యం జరిగే ఉచిత ప్రసాద వితరణకు గుంటూరు భక్తులు రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. చంద్రమౌళినగర్‌కు చెందిన శ్రీమోహన్‌సాయి, లక్ష్మీనారాయణ, రజనీ, డాక్టర్ అనులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. శివశంకర్, పద్మ పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
గోసంరక్షణకు రూ. లక్ష..
దుర్గమ్మ సన్నిధిలోని గోసేవ పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన జి.రంగలక్ష్మి, సూర్యనారాయణ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈవో శీనానాయక్‌ను కలిసి గోసంరక్షణ నిధికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.