రాష్ట్రంలో నారావారి రాజ్యాంగం నడుస్తోంది | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నారావారి రాజ్యాంగం నడుస్తోంది

Jul 20 2025 5:31 AM | Updated on Jul 20 2025 5:31 AM

రాష్ట్రంలో నారావారి రాజ్యాంగం నడుస్తోంది

రాష్ట్రంలో నారావారి రాజ్యాంగం నడుస్తోంది

పెడన:రాష్ట్రంలో నారావారి రాజ్యాంగం నడుస్తోందని, ఇందులో భాగంగానే మహిళలపై దాడులు పెరిగా యని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ బీసీసెల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్లు రమేష్‌ యాదవ్‌ అన్నారు. బీసీ మహిళ, క్యాబినేట్‌ ర్యాంకు ఉన్న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమ న్నారు. రమేష్‌యాదవ్‌తో పాటు ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, కె.ఆర్‌.జె.భరత్‌, పలు బీసీ సంఘాల నాయకులు పెడన మండలం కృష్ణాపురంలోని హారిక, రాము నివాసానికి చేరుకుని వారిని పరామర్శించారు. ఈ నెల 12న గుడివాడలో టీడీపీ, జనసేన గూండాలు చేసిన దాడి గురించి అడిగి తెలుసుకు న్నారు. అనంతరం రమేష్‌యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. హారిక దంపతులను చంపుతామంటూ దాడి చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపై బెదిరింపులకు దిగేలా పోలీసుల తీరుందన్నారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఐదు నిమిషాల్లో చర్యలు తీసుకుంటానన్న డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బీసీ మహిళపై దాడి జరిగి వారం గడిచినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకే చెందిన బీసీ మంత్రి సాటి మహిళ బాధపడుతుంటే మహానటిగా పేర్కొవడం సిగ్గుచేటన్నారు. బీసీలపై దాడులు చేస్తూ ఉంటే ఊరుకోబోమని హెచ్చరించారు. హారికకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా అండగా ఉంటామన్నారు.

పోలీసులు దగ్గరుండి జరిపించినట్టుంది

దాడి జరిగిన వీడియోలను చూస్తే చాలా బాధ కలిగిందని, పోలీసులే దగ్గరుండి దాడి చేయించినట్లు ఉందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. ఒక మాజీ పోలీస్‌ అధికారిగా జరిగిన ఘటనను వీడియోల్లో చూసి సిగ్గు పడుతున్నానన్నారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డీఎస్పీ దాడి సమయంలో ఉన్నా తానేం చేయాలని పేర్కొవడం హాస్యాస్పదంగా, దాడిని ప్రోత్సహించి నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల బాధ్యత మరచారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై గవర్నర్‌కు, రాష్ట్రప్రతికి ఫిర్యాదు చేస్తామన్నారు.

పోలీసులు ఉన్నారనే ధైర్యం లేదు

భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కాని, ప్రజలను కాపాడటానికి పోలీసులు ఉన్నారనే నమ్మకాన్ని పోగొట్టేలా హారికపై దాడి జరిగిన ఘటనలో పోలీ సుల తీరు ఉందని ఎమ్మెల్సీ కె.ఆర్‌.జె.భరత్‌ అన్నారు. గుడివాడలో జరిగిన దాడిపై కేసు పెట్టడానికి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లితే పెడనలో కేసు పెట్టాలని సూచించడం శోచనీయమన్నారు. హారికకు జరిగిన అన్యాయంపై బీసీ కమిషన్‌కు, మహిళా కమిషన్‌ ఎక్కడ న్యాయం దొరుకుతుందో అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుగురి సూర్యనారాయణ, ఏలూరు జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, సంఘ నాయకులు మిద్దె వెంకటేశ్వరరావు, డి.శ్రీనివాస్‌, తుమ్మగుంట రంగ, రాష్ట్రంలోని పలు బీసీ సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు హారిక దంపతులను పరామర్శించారు.

హారికపై పోలీసులే దాడిని ప్రోత్సహించినట్లు ఉంది దాడిపై గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్‌, ఏసురత్నం, భరత్‌ ఉప్పాల హారిక, రాముకు పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement