
గన్నవరం పీఎస్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్
గన్నవరం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ శనివారం గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుకు సంబంధించి కోర్టు బెయిల్ షరతుల మేరకు ఆయన పీఎస్‌లో సంతకం చేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనను నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశాయి. వారందరిని వంశీమోహన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు.