
హారికకు జెడ్పీ సీఈవో పరామర్శ
పెడన: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై ఈనెల 12న గుడివాడలో దాడి జరిగిన నేపథ్యంలో శుక్రవారం ఆమెను జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు పరామర్శించారు. డిప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన పెడన మండలం కృష్ణాపురం గ్రామంలో హారిక నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ దాడి ఘటనలో ధ్వంసమైన ప్రభుత్వ కారును కన్నమనాయుడు పరిశీలించారు. అయితే కారును ధ్వంసం చేసిన వారిపై కేసు పెట్టే అంశాన్ని విలేకరులు సీఈవో కన్నమనాయుడు వద్ద ప్రస్తావించగా, ఆ అంశంపై ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంపై గమనార్హం.

హారికకు జెడ్పీ సీఈవో పరామర్శ