
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
కోనేరుసెంటర్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యమని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. కృష్ణా జిల్లా బందరు మండలం కరగ్రహారం గ్రామంలో నిర్మించనున్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం నిర్మాణ పనులకు గురువారం ఆమె రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ యార్లగడ్డ రాము, ఐజీపీ అశోక్‌కుమార్, ఎస్పీ గంగాధర్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో పోలీసు శిక్షణ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. బందరులో దాదాపు 46 ఎకరాల్లో ఏర్పాటవుతున్న పోలీస్ శిక్షణ కేంద్రం మచిలీపట్నానికి తలమానికం కానుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాలు ఘోరాలు జరగ కుండా నిరంతర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతంలోనే మైరెన్ పోలీసు స్టేషన్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.32 కోట్ల వ్యయ అంచనాతో 46 ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్‌రాజా, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హోం మంత్రి అనిత మచిలీపట్నంలో పోలీసు శిక్షణ కేంద్రం నిర్మాణ పనులకు భూమిపూజ