
హైదరాబాద్ నుంచి పారిపొయొచ్చిన చిన్నారులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): హైదరాబాద్‌లోని మదర్ సా నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులను ఎస్‌కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ హోమ్‌కు తరలించారు. బిహార్‌కు చెందిన 12 ఏళ్ల వయసు కలిగిన ఐదుగురు బాలురను వారి తల్లిదండ్రులు మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని మదర్ సాలో చేర్పించారు. అక్కడ భోజనం నచ్చకపోవడంతో పాటు అక్కడ ఉండడం ఇష్టంలేక అక్కడ నుంచి పారిపోయి హైదరాబాద్ బస్టాండ్‌లో విజయవాడ బస్సు ఎక్కి పీఎన్‌బీఎస్ బస్టాండ్‌కు చేరుకున్నారు.
ఎక్కడికి వెళ్లాలో తెలియక గంటపాటు బస్టాండ్‌లోనే ఉన్నారు. బుధవారం ఉదయం వారిని గమనించిన ట్రస్ట్ ప్రతినిధి ఎం.గీతావాణి రెస్క్యూ చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ విషయాన్ని ఆమె చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు ఎస్‌కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ హోమ్‌కు తరలించారు. చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించామని, సోమవారం వచ్చి చిన్నారులను తీసుకెళ్తామని చెప్పినట్లు గీతావాణి తెలిపారు.