
‘పీ–4’ అమలుపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): ేపదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన పీ–4 కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టిసారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో పీ–4 కార్యక్రమం అమలుపై నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమానికి సంబంధించిన సమస్యలు, సలహాలు, సూచనలు తెలియజేయాలన్నారు. అర్హులైన పేద కుటుంబాలను గుర్తించటంతో పాటు వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శులను గుర్తించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్గదర్శులు, బంగారు కుటుంబాలను ఎంపిక చేసే క్రమంలో ఆన్‌లైన్ పోర్టల్‌లో కేవలం కుటుంబ యజమాని పేరు మాత్రమే కాకుండా ఆ కుటుంబంలోని సభ్యులందరి పేర్లు నమోదు చేయాలన్నారు. జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డీపీవో జె. అరుణ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, సీపీవో ఎస్.భీమరాజు, పశుసంవర్ధకశాఖ జేడీ చిననరసింహులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ