
విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో శుక్రవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో కె చంద్రశేఖరరావు, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీద్ జావెల్, కెఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవోలు స్వాతి, బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్, ఇరిగేషన్ ఎస్‌ఈ మోహనరావు, డీఎస్‌వో పార్వతి పాల్గొన్నారు.
స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలి
భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సమావేశపు హాలులో ఎన్నికల అధికారులు అసిస్టెంట్ ఎన్నికల అధికారులతో ఆయన మాట్లాడి సూచనలు చేశారు.
‘ఆక్వా’ సమస్యల పరిష్కారానికి చర్యలు
జిల్లాలో ఆక్వా పరిశ్రమల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో శుక్రవారం ఆక్వా పరిశ్రమల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ