
ఏడాది కూటమి పాలనలో ఘొల్లుమంటున్న పల్లెలు
ఇదిగో నాటి వికాసం
Æ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పాలన ఎంతో సమర్థంగా సాగిందంటూ ప్రజలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి.
Æ ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో రూ. కోటి వరకూ విలువైన ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తెచ్చింది. కృష్ణాజిల్లాలో 497 పంచాయతీలకు 385 సచివాలయాలు, ఎన్టీఆర్ జిల్లాలో 288 పంచాయతీలకు 285 సచివాలయాలు ఏర్పాటు చేసింది.
Æ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది విద్యాభివృద్ధికి బాటలు వేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని చేరువ చేసింది. కృష్ణాజిల్లాలో 1791 పాఠశాలలకు గానూ 488 పాఠశాలల్లో రూ.179 కోట్ల ను, ఎన్టీఆర్ జిల్లాలో 886 పాఠశాలలకు గానూ 341 పాఠశాలల్లో రూ.80 కోట్లతో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేశారు. దీంతో విద్యా ప్రగతికి బాటలు వేయటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుంది.
Æ రైతు భరోసా కేంద్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. కృష్ణాజిల్లాలో 363, ఎన్టీఆర్ జిల్లాలో 267 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులు, ఏకంగా ఐక్యరాజ్య సమితి బృందం వణుకూరు, గన్నవరం మొదలైన ప్రాంతాల్లో పర్యటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను తెలుసుకుని ప్రశంసించారంటే వాటి నిర్వహణ సామర్థ్యం ఏంటో అర్థమవుతుంది.
Æ ప్రజారోగ్యాన్ని పెంపొందించేలా కృష్ణా జిల్లాలో 357, ఎన్టీఆర్ జిల్లాలో 257 వెల్‌నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చి గ్రామ స్థాయికి వైద్య సేవలను విస్తృతం చేసి, ప్రజారోగ్య పరిరక్షణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాటుపడింది.
కంకిపాడు: ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ హామీలను ఊదరగొట్టింది. పింఛన్లు, మహిళలకు నెలకు రూ. 1500, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అంటూ ప్రజలను మభ్యపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,34,909 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 2,24,216 మందికి సామాజిక పింఛన్లను అందిస్తున్నారు. ఇందుకు గానూ రూ. 199 కోట్లు సొమ్ము అందజేస్తున్నారు. ఇటీవల గ్యాస్ సిలెండర్ల వర్తింపు మినహా(అదీ అరకొరే), ఇతర పథకాలు ఏవీ అమలుకు నోచుకోలేదు. ఏడాది పాలనలో ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు ఎదురుచూసిన ప్రజానీకం ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచే నాటికే అమ్మ ఒడి, సాగుకు పెట్టుబడి సాయం విడతల వారీగా అందిందని గుర్తు చేసుకుంటున్నారు.
అంతా మా ఇష్టం.. మా వాళ్లకే..
కూటమి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల అందజేత కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ప్రహసనంగా సాగుతోంది. ఆయా గ్రామ, వార్డుల్లో కూటమి నేతలే నేరుగా అధికారులతో కలిసి వెళ్లి పింఛను లబ్ధిదారులను కలిసి పింఛన్ పంపిణీని ప్రచార ఆర్భాటంగా సాగిస్తున్నారు. నేతలు ఫొటోలకు ఫోజులిస్తూ లబ్ధిదారులను తమ గుప్పిట పెట్టుకునేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. వివిధ కార్పొరేషన్‌ల కింద జారీ చేసే స్వయం ఉపాధి రుణాల ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. లబ్ధిదారుల ఇంటర్వ్యూలు మండలాల్లో మొక్కుబడిగా సాగాయంటే అతిశయోక్తి కాదు. మొక్కుబడిగా యూనిట్ల కేటాయింపు, ఇంటర్వ్యూలు జరిగిపోయాయి. అన్నీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వచ్చే సిఫారసు లేఖల ఆధారంగానే పూర్తి చేశారనే విమర్శ ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్‌ల కింద స్వయం ఉపాధికి యువత, మహిళలకు రుణా లు అందించి, తోడ్పాటు అందించింది. లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా అర్హతను బట్టి వలంటీర్ల చేసింది.
అరకొర సేవలతో
అవస్థలు పడుతున్న ప్రజలు
నిర్వీర్యమవుతున్న సచివాలయ,
ఆర్బీకే వ్యవస్థలు
పాలనంతా కూటమి నేతల
కనుసన్నల్లోనే..
ఆఖరికి స్వయం ఉపాధి రుణాల
జారీలోనూ ఏకపక్ష నిర్ణయాలే
లబోదిబోమంటున్న ప్రజలు
గత వైఎస్సార్ సీపీ పాలనలో
రాజకీయాలు, కులమతాలకు
అతీతంగా సేవలు, పథకాలు
వ్యవస్థలను కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే గ్రామ స్వరాజ్యం సాధన దిశగా ఏర్పాటుచేసిన సచివాలయాలు, వాటిలో పనిచేసే సిబ్బంది మదింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే జరిగితే గ్రామ సచివాలయ స్థాయిలో ఉద్యోగు లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీని వల్ల గ్రామ స్థాయిలోనే అందే అనేక రకమైన పౌర సేవలకు విఘాతం కలుగుతుంది. ఇప్ప టికే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడింది. తాజాగా ఇంటికి రేషన్ పంపిణీ వాహనాలను తొలగించి, వాహనాలపై ఆధారపడి జీవించే అనేక మంది యువతను రోడ్డు పాలు చేసింది. మళ్లీ కిలో మీటర్ల దూరం వృద్ధులు సైతం నడుచుకుంటూ వెళ్లి రేషన్ డిపోల వద్ద సరుకులు తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితులు దాపురించబోతున్నాయి.
పేరుకే సచివాలయాలు.. ఆర్బీకేలు..
ఇప్పటికే సచివాలయాల్లో సిబ్బంది సర్వేల పేరుతో ఇళ్ల వెంబడి తిరుగుతుంటే ప్రజలు సేవల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రైతు సేవా కేంద్రాలు(నాటి ఆర్బీకేలు) నామ్‌కే వాస్తే అన్న చందంగా మారాయి. అందులో రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన కియోస్క్‌లు మరమ్మతులు లేక రైతు సేవలకు దూరంగా ఉంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులు పూర్తిగా కోలుకోలేదు. రబీ ధాన్యం సేకరణ దళారులు, మిల్లర్లు పుణ్యమాని అస్తవ్యస్తంగా సాగటంతో రైతులు నష్టపోయారు. ఉన్నత లక్ష్యంతో రైతుకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌బీకేలు నేడు అలంకార ప్రాయంగా మారుతున్నాయంటే.. దానికి సర్కారు అనాలోచిత, నిర్లక్ష్య విధానాలే కారణమని పలువురు విమర్శిస్తున్నారు.

ఏడాది కూటమి పాలనలో ఘొల్లుమంటున్న పల్లెలు

ఏడాది కూటమి పాలనలో ఘొల్లుమంటున్న పల్లెలు

ఏడాది కూటమి పాలనలో ఘొల్లుమంటున్న పల్లెలు

ఏడాది కూటమి పాలనలో ఘొల్లుమంటున్న పల్లెలు