
నరసింహస్వామికి వైభవంగా హనుమంతు స
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం హనుమంతు సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హనుమంతు వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అర్చకులు శ్రీధరాచార్యులు, వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో సురేష్‌బాబు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు స్వామి వారి కల్యాణం జరుగుతుండటంతో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీక్షా స్వాముల ఇరుముడి సమర్పణ, అమ్మ, స్వామి వారి ఎదురుకోలోత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిల్లకల్లు పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేశారు.
సీఎస్‌ఎస్‌ఎస్‌ఎన్‌రెడ్డికి డీఐఈఓగా ఉద్యోగోన్నతి
పాయకాపురం(విజయవాడరూరల్): ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్‌చార్జిగా పని చేస్తున్న సీఎస్‌ఎస్‌ఎస్‌ఎన్ రెడ్డిని ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా డీఐఈఓగా ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేసింది. ఆయన పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, జిల్లా ఒకేషనల్ ఆఫీసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఏలూరు నుంచి బి.ప్రభాకర్‌ను ప్రభుత్వం ఎఫ్‌ఏసీగా నియమించింది.