
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
I
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ మన్మధరావు
మచిలీపట్నం అర్బన్: మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వి.మన్మధరావును నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌లో జనరల్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
బ్యాక్‌లాగ్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉయ్యూరులోని గిరిజన సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి బ్యాక్‌లాగ్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఎం.ఫణిధూర్జటి శనివారం తెలిపారు. ఈ పాఠశాలలో మూడో తరగతి 40 సీట్లు, నాల్గవ తరగతి 40, ఐదో తరగతి 40, ఆరో తరగతి 29, ఏడో తరగతి 26, ఎనిమిదో తరగతి 26, తొమ్మిదో తరగతి 17 సీట్లు ఉన్నాయన్నారు. ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయలకు మించి ఉండకూడదన్నారు. దరఖాస్తులను ఉయ్యూరు రాజేంద్రనగర్‌లోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఈ నెల 28వ తేదీలోగా నేరుగా అందజేయాలన్నారు. లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్ కమిటీ విద్యార్థులను ఎంపిక చేస్తుందన్నారు. మరిన్ని వివరాల కోసం 99088 39476, 93916 01861 నంబర్లను సంప్రదించాలన్నారు.
కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక
పెనమలూరు: కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక చేశామని పోరంకి శ్రీకృష్ణవేణి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వి.భూలక్ష్మి తెలిపారు. ఆమె శనివారం వివరాలు తెలుపుతూ పోరంకిలో జరిగిన జట్టు ఎంపికలో కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టుకు 16 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని చెప్పారు. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ (పురుషులు) పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని వివరించారు. జట్టు మేనేజర్‌గా ఎ.వినయ్‌కుమార్‌రెడ్డి, కోచ్‌గా ఆర్.సురేష్ ఉంటారని తెలిపారు.
న్యూస్‌రీల్

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా