అంబేడ్కర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్క ర్‌ 135వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కొత్తపల్లి అనిత, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మాట్లాడు తూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహాత్తర విలువలను రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన చూపిన మార్గం సమాజానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ రచించిన రాజ్యంగంతోనే ఈ రోజు దేశం అవిచ్ఛిన్న భూ భాగంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తి వంచనలేకుండా కృషి చేస్తామన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కా ర్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కౌన్సి లర్లు దుర్గం సూరజ్‌, ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, సమత సొసైటీ అధ్యక్షుడు దుర్గం జనార్ధన్‌, ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేస్తున్న ఎమ్మెల్సీ విఠల్‌

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే హరీశ్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement