కాగజ్‌నగర్‌టౌన్/సిర్పూర్(టి): గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన దక్షిణ గోండ్ వాన గోండ్‌రాజు మోకాసి స్మారక జెండా పూజా కార్యక్రమానికి సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి హాజరయ్యారు. అనంతరం రాయిదర్బార్‌లో మాట్లాడారు. మేడిపల్లి గ్రామానికి 154 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, అటవీశాఖ సమస్యలతో కొన్ని నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిర్పూర్(టి) నుంచి మాలిని వరకు బీటీరోడ్డు, రెండు వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధుల కేటా యింపులు, అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీవో సత్యనారాయణ, ఆదివాసీ సంఘం నాయకులు సిడాం అర్జు, మోతీరాం, మారు, భీంరావు, శ్రీనివాస్, మాణిక్‌రావు, లాహను, నాగరాణి, నానయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్బార్‌కు వచ్చిన ఆదివాసీలకు అంబలి పంపిణీ చేశారు.


