 
															ఏరియాలో సీఎంవో పర్యటన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో సింగరే ణి చీఫ్ మెడికల్ అఫీసర్(సీఎంవో) కిరణ్‌రాజ్ గురువారం పర్యటించారు. మొదట బెల్లంపల్లి పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో వసతులు, ల్యాబ్‌ను తనిఖీ చేశారు. ప్రతిరోజూ ఎంతమంది ఉద్యోగులు చికిత్స కోసం వస్తున్నారని ఆరా తీశారు. రికార్డుల ను పరిశీలించారు. అనంతరం గోలేటి, మాదారం డిస్పెన్సరీలను సందర్శించారు. వైద్యులు, సిబ్బంది కి సూచనలు చేశారు. పునరావాస కాలనీల్లో మొబై ల్ హెల్త్ క్యాంపుల ద్వారా అందిస్తున్న వైద్యసేవలు కొనసాగించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గోలేటిలోని జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డిని కలిశారు. ఏరియా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు అందిస్తున్న వైద్యసేవలపై చర్చించారు. కార్యక్రమంలో డీవైసీఎంవో పాండు రంగాచారి, వైద్యులు మురళీ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
