అమరుల త్యాగాలు మరువలేనివి
ఆసిఫాబాద్‌రూరల్: పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురు వారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాల యం నుంచి ఏఎస్పీ చిత్తరంజన్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో కలిసి రహదారి భద్రతపై హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు హెల్మెట్ ధరించకపోవడంతోనే ప్రాణనష్టం జరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రేవ్ కేసుల్లో నాణ్య మైన దర్యాప్తు చేసి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గు రువారం మండల కేంద్రంలోని సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్ కేసుల వివరాలను సీఐ సంజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరుచూ సందర్శిస్తూ, ఎస్‌హెచ్‌వోలకు సూచనలు, సలహాలను అందించా లని అన్నారు. సర్కిల్ కార్యాలయ రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సీఐతోపాటు సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ, తిర్యాణి ఎస్సై వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


