ముగ్గురు వేటగాళ్లపై కేసు
వాంకిడి: వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి బుధవారం రాత్రి జైలుకి తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ధరావత్ భీమా, గుర్నులె తిరుపతి, నగోషే బీర్సావ్ అనే ముగ్గురు వ్యక్తులు జోగాపూర్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చుతుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి విద్యుత్ తీగలను స్వాధీనం చేసుకొని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్ధార్ తెలిపారు. దాడుల్లో డిప్యూటీ రేంజ్ అధికారిని ఝాన్సిలక్ష్మి, ఎఫ్‌ఎస్‌వో సాయి చరణ్, ఎఫ్‌బీవోలు ప్రభాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


