‘గుస్సాడీ’కి దేశవ్యాప్త గుర్తింపు
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. కెరమెరి మండలం సాకడ(బి) గ్రామంలో మంగళవారం నిర్వహించిన దండారీ ఉత్సవాలకు హాజరయ్యారు. గుస్సాడీలకు పాదాభివందనం చేసి, మహిళలతో కలిసి దండారీ ఆడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏత్మాసూర్ దేవత ఆది వాసీలకు ఎంతో పవిత్రమైందన్నారు. ప్రతీ దండారీకి ప్రభుత్వం రూ.15వేలు ఇస్తామని ప్రకటించినా ఇప్పటికీ అందించలేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రతీ దండారీకి రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. నాయకులు మర్సకోల సరస్వతి, మోతీరాం, అంబాజీరావు, బీర్శావ్, తుకారాం, లింబారా వు, దంబిరావు, సీతారాం పాల్గొన్నారు.


