కార్తీక పూజలకు ముస్తాబు
కాగజ్‌నగర్‌టౌన్: కోరిన కోర్కెలు తీర్చే భక్తు ల కొంగుబంగారం కాగజ్‌నగర్ మండలంలో ని ఈజ్‌గాం శివమల్లన్న స్వామి దేవాలయం ప్రత్యేక పూజలకు ముస్తాబైంది. కార్తీక మా సం సందర్భంగా ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వరకు పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గర్రెపల్లి వేణుగోపాల్ గుప్తా తెలిపారు. లోక కల్యాణార్థం నెల రోజులపాటు ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాజప, రుద్రహో మం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు రూ.151 చెల్లించి పూజ ల్లో పాల్గొనవచ్చని, అలాగే నవంబర్ 16న జరిగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే దంపతులు రూ.501 చెల్లించాలని సూచించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనే వారు ప్రమిదలు తీసుకురావాలన్నా రు. భక్తులు సంప్రదాయ దుస్తులైన దోవతి, పంచె, కండువాలతో రావాలని కోరారు.


