కన్నెపల్లిలో మద్యపాన నిషేధం | - | Sakshi
Sakshi News home page

కన్నెపల్లిలో మద్యపాన నిషేధం

Jun 23 2025 6:16 AM | Updated on Jun 23 2025 6:16 AM

కన్నెపల్లిలో మద్యపాన నిషేధం

కన్నెపల్లిలో మద్యపాన నిషేధం

కౌటాల: మండలంలోని కన్నెపల్లి గ్రామంలో శని వారం రాత్రి మహిళలు తమ గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తున్నట్లు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో విచ్ఛలవిడిగా మద్యం విక్రయిస్తుండడంతో యు వత, పురుషులు మద్యానికి బానిసై ఆత్మహత్యల కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మద్యానికి బానిసైన వారు అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోయారు. మందుబాబులు మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తెలిపా రు. గ్రామంలో మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో మద్యం విక్రయించినా, మద్యం సేవించినా చర్యలు తీసుకుంటామని మహిళలు తీర్మానం చేశారు. కార్యక్రమంలో మహిళలు పద్మ, జ్యోతి, విమల, భాగ్యలక్ష్మి, ఇందిరా, వనిత, శారద, తారాబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement