బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

Jun 12 2025 3:43 AM | Updated on Jun 12 2025 3:43 AM

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను సమష్టిగా నిర్మూలిద్దామని జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో షూర్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కరపత్రాలు ఆవిష్కరించారు. అనుబంధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు వారంపాటు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం డీసీపీవో మహేశ్‌ మాట్లాడుతూ ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, షూర్‌ ఎన్జీవోల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బాల రక్ష భవన్‌ సిబ్బంది, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ బాల ప్రవీణ్‌కుమార్‌, షూర్‌ సంస్థ డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ సంతోష్‌కుమార్‌, డీహెచ్‌ఈ డబ్ల్యూ మిషన్‌ కోఆర్డినేటర్‌ శారద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement