
గోవులను కబేళాలకు తరలిస్తే చర్యలు
● డీఎస్పీ రామానుజం
కాగజ్‌నగర్‌టౌన్: గోవులను కబేళాలకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం అన్నారు. పట్టణంలోని టౌన్ పోలీస్టేషన్‌లో బుధవారం కబేళాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పశువైద్యాధికారి ఫిట్‌ఫర్ స్లాటర్ సర్టిఫైడ్ చేసిన పశువులను మాత్రమే కబేళాలకు తరలించాలని సూచించారు. వేస్టేజ్‌ను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని, పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. బక్రీద్ సందర్భంగా సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పశుౖవైద్యాధికారి పరిమళ, సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ పత్తి విత్తనాలపై నిఘా
నకిలీ పత్తి విత్తనాలు, ఎరువులపై నిఘా ఉంచామ ని, రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామానుజం హెచ్చరించారు. పట్టణ పోలీస్టేషన్‌లో బుధవారం ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించిన వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. కాగజ్‌నగర్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.