
మహారాజ్‌గూడలో వరకట్న నిషేధం
లింగాపూర్(ఆసిఫాబాద్): సిర్పూర్(యూ) మండలం మహాగాం గ్రామ పంచాయతీ పరిధిలోని మహారాజ్‌గూడలో వరకట్నం నిషేధిస్తూ గ్రామస్తులు తీర్మానించారు. గ్రామానికి చెందిన మడావి యాదవ్‌రావు, చంద్రభాగ దంపతుల కుమార్తె వివా హానికి గ్రామస్తులు కుటుంబం నుంచి రూ.500 చొప్పున జమ చేసి మంగళవారం రూ.25,000 నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ మెస్రం శ్యాంరావు మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో వరకట్నం నిషేధించాలన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మహారాజ్‌గూడలో వరకట్న నిషేధంతోపాటు వివాహానికి గ్రామస్తులు ఆర్థికసాయం అందించాలనే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెస్రం దత్తు, ఆత్రం ఆనంద్‌రావు, సురోజీ, కై లాస్ తదితరులు పాల్గొన్నారు.