
అర్హులందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
రెబ్బెన: అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజీవ్ యువ వికా సం పథకం ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ సోమవారం అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కుమురం భీం జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు అందించాలన్నారు. ప్రధానంగా బ్యాంకులు సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు. రుణాల మంజూరు విషయంలో గతంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం బీసీ ఇన్‌చార్జి ఈడీగా వ్యవహరిస్తున్న అధికారిని వెంటనే ఆ బాధ్యతల నుంచి తొలగించి మరో అధికారికి అప్పగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు అన్యాయం జరిగితే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే ఇళ్లు మంజూరు చేశారని, దీంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల మధుకర్‌గౌడ్, సోనాపూర్ గ్రామపటేల్ కుమురం దొందేరావు, తదితరులు పాల్గొన్నారు.