
మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా చేయాలి
లింగాపూర్: ప్రతీ గ్రామానికి మిషన్ భగీరథ నీరు సక్రమంగా ఆందించాలని మిషన్ భగీ రథ ఎస్‌ఈ రవీందర్ సూచించారు. మండలంలోని వంకామద్ది, గుంమ్నూర్, జాముల్‌ధర, నాయక్‌పోడ్‌గూడ, మారుగూడతోపా టు సిర్పూర్ (యూ) మండలంలోని భీమన్‌గుట్ట, శెట్టిహడప్నూర్ గ్రామాలను ఆయన శని వారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లా డి భగీరథ నీటి సరఫరా గురించి తెలుసుకున్నారు. ప్రతీ గ్రామానికి మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా చేయాలని అధి కారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆయన వెంట వాటర్‌గ్రిడ్ ఈఈ రాకేశ్, ఈఈ సిద్దిక్, డీఈ నరేశ్, ఏఈఈ క్రాంతితేజ, ఏఈ అరవింద్ ఉన్నారు.