
పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని వినతి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పె యింటింగ్ పనులు పూర్తి చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి మాట్లాడా రు. బాడిబాటకు ముందే అమ్మ ఆదర్శ పాఠశాలల పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. పాఠశాలల్లో పనులు పూర్తయినప్పటికీ గదులకు రంగులు వేయలేదని పేర్కొన్నారు. సమగ్ర సర్వే విజయవంతంగా పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. సర్వేకు సంబంధించిన రెమ్యునరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఉ షన్న, కోశాధికారి రమేశ్, నాయకులు సుభా ష్, సంతోష్, అరవింద్ తదితరులున్నారు.