
సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని గ్రంథాలయాల్లో పని చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని పీటీఎస్ సి బ్బంది శనివారం హైదరాబాద్‌లో గ్రంథాలయ పీటీఎస్ జనరల్ సెక్రటరీ ముజీబ్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో పని చేస్తున్న తమకు వేతనాలు పెంచాలని కోరారు. ప్రస్తుతం నెలకు రూ.7వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా రూ.20 వేల వేతనం ఇవ్వాలని కోరా రు. దీంతో ముజీబ్ హుస్సేన్ స్పందించి వేతనం రూ.18,600 చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలి పారు. సంఘం సభ్యులు మధు, సలీం, అంకుశం బుచ్చన్న, రాజారాం, శంకర్, ప్రేమ్‌సాగర్ ఉన్నారు.