
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
దహెగాం: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రా మాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీస్తున్నా రాత్రి వేళ రైతులు కొనుగోలు కేంద్రాల వ ద్దకు పరుగులు తీశారు. ధాన్యం తడవకుందా టా ర్పాలిన్లు కప్పారు. గాలి ఎక్కువగా ఉండటంతో టా ర్పాలిన్లు లేచి ధాన్యం తడిసింది. ధాన్యం కుప్పల కింద వర్షపు నీరు చేరింది. కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం 20 రోజులుగా ఆరబెడుతున్నా తూకం వేయడంలేదని రైతులు ఆరోపించారు. తూకం వేసిన ధాన్యం లోడింగ్ చేయడం లేదని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. భారీ వర్షం కారణంగా అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. వాతావరణం చల్లబడింది. అకాల వర్షాలకు రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.
పెంచికల్‌పేట్ మండలంలో..
పెంచికల్‌పేట్: మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. చేడ్వాయి, ఎల్కపల్లి, ఎల్లూర్, కొండపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
కౌటాల మండలంలో..
కౌటాల: మండలంలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని సాండ్‌గాం గ్రామంలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిచిపోయింది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ఆ రబోసిన ధాన్యం తడవకుండా రైతులు కవర్లు కప్పడానికి తిప్పలు పడ్డా రు. సాండ్‌గాం, ముత్తంపేట, వీరవెల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేయాలని కోరుతున్నారు.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం