
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్ నుంచి జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, గృహ నిర్మాణశాఖ అధికారులతో పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అర్హుల జాబితా, రాజీవ్ యువ వికాసానికి అర్హుల ఎంపిక, తాగునీటి సరఫరా, నమూనా ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణం, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం, ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంపుదల తదితర అంశాలపై అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటిని 400నుంచి 600 చదరపు గజాల్లో మాత్రమే నిర్మించాలని సూచించారు. రాజీవ్ యువ వికాసానికి అర్హులను ఎంపిక చేసి జాబితా రూపొందించి జిల్లా స్థాయి క మిటీకి అందించాలన్నారు. అర్హులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఉపాధిహా మీ పనులకు కూలీల సంఖ్య పెంచాలని, పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీటిని అందించాలని పేర్కొన్నా రు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఉపాధిహా మీ పనుల్లో భాగంగా సామాజిక ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షతిగౌడ్, జిల్లా సంక్షేమాధికారి సజీవన్, జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీనారాయణ, మైనార్టీ సంక్షేమాధికారి నదీమ్, డీటీడీవో రమాదేవి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ భుజంగ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
అధికారులతో సమీక్ష