
ధాన్యాన్ని వెంటవెంటనే తరలించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం రెబ్బెన మండలం ఇందిరానగర్ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ గడువులోపు పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తహసీల్దార్ రామ్మోహన్, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, సివిల్ సప్లయ్ అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.