
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
దహెగాం: క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌వో సీతారాంనాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలకు ఎన్‌టీఈసీ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. క్షయ కారణంగా దేశవ్యాప్తంగా ఏడాదిలో స గటున 3లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. వ్యాధికి వైద్యం అందుబాటులో ఉందని, వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోనూ వైద్యం అందుబా టులో ఉందని చెప్పారు. వ్యాధి లక్షణాలు గుర్తించడానికి త్వరలో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. లక్షణాలున్న వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి వైద్యం పొందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. క్షయ సోకి ప్రభుత్వ వైద్యం పొందుతున్నవారికి నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరునెలలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారిని అశ్విని, హెచ్‌ఈవో కోటేశ్వర్, పీహెచ్‌ఎం పావని, హెచ్‌వీ పద్మ, సూపర్‌వైజర్ ఖాదర్‌పాషా, పార్మసిస్ట్ రామచంద్రారెడ్డి, సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.