
లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ కోరా రు. శుక్రవారం న్యాయ స్థానంలో న్యాయవా దులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు అధికసంఖ్యలో రాజీ కేసులు వచ్చేలా చూడాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడే క్రిమినల్, సివిల్, భూతగాదా కేసులు లాంటివి రాజీపడదగు కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకా శాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జూనియర్ సివి ల్ జడ్జి అనంతలక్ష్మి, అడ్వకేట్ పాల్గొన్నారు.