
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా వ్యవసాయ శాఖ 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సాగు ప్రణాళిక ఖరారు చేసింది. అధికారులు సాగు అంచనాలు సిద్ధం చేసి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో వానాకాలం సీజన్‌లో మొత్తంగా 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనాలు వేశారు. పత్తి పంటకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుండగా రెండో స్థానంలో వరి సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వానికి నివేదికలు
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో పంటల సాగు అంచనాలు వేసిన అధికారులు అందుకు అవసరమయ్యే విత్తనాలకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. జిల్లాలో 4,45,049 ఎకరాల్లో వివి ధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో మూడో వంతు పత్తిని సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో సాగునీటి ప్రాజక్టులు పూర్తి కాక పోవడం, ఉన్న ప్రాజక్టుల కాలువలు మరమ్మతులకు నోచుకోక పోవడంతో వర్షాధార పంటలనే రైతులు ఆధారపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 3,35,363 ఎకరాల్లో పత్తి, 56,861 ఎకరాల్లో వరి, 30.430 ఎకరాల్లో కంది, 22,395 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఆముదాలు, నువ్వులు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనాలు రూపొందించారు. 6,70,726 పత్తి విత్తన ప్యాకెట్లు, 14,215 క్వింటాళ్ల వరి, 1,217 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని అంచనా వేశారు.
ఎరువుల కొరత లేకుండా..
జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత లేకుండా అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు. యారియా 60,061 మెట్రిక్ టన్నులు, డీఏపీ 400.54 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 10,013 మెట్రిక్ టన్నులు, ఎ స్‌ఎస్‌పీ 20,027 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎ రువులు 20,027 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువు ల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
అంచనాలు సిద్ధం చేశాం
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుపై ప్రణాళికలు సిద్ధం చేసి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకుగానూ ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాం. సాగు ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశాం.
– రావూరి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి
సాగు విస్తీర్ణం 4,45,049 ఎకరాలుగా అంచనా..
3,35,363 ఎకరాల్లో పత్తి సాగు..
6.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని ప్రతిపాదన

ఖరీఫ్ ప్రణాళిక ఖరారు