
జేటీవో ఉద్యోగానికి యువకుడి ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన నడిగోటి అనుదీప్ కుమార్ నీటి పా రుదల శాఖలో జూని యర్ టెక్నికల్ అధికారి(సివిల్)గా నియామ కం అయ్యాడు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. అనుదీప్ కుమార్ తండ్రి నడిగోటి కుమార్ నాయీబ్రాహ్మణ వృత్తి నిర్వహిస్తూ కొడుకును ఉన్నతంగా చదివించాడు. అనుదీప్ కుమార్ బెల్లంపల్లిలో పదో తరగతి వరకు, హైదరాబాద్ రామాంతపూర్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. 2023అక్టోబర్ 19న జేటీవో ఉద్యోగానికి పరీక్ష రాయగా గత జనవరి 24న తుది ఫలితాలు ప్రకటించారు.