
ఘనంగా శంభాజీ మహరాజ్ జయంతి
వాంకిడి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని జేత్వా న్ బుద్ధ విహార్‌లో బుధవారం ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసుడిగా మరాఠా సామ్రాజ్యానికి రెండో ఛత్రపతి రాజుగా శంభాజీ మహరాజ్ గొప్ప ఖ్యాతిని సంపాదించారన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించకుండా ఆపగలిగిన మహా వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా ఇన్‌చార్జి దుర్గం సందీప్, బీఎస్‌ఎస్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్రె వినేష్, అంబేడ్కర్ సంఘం నాయకులు శ్యాంరావు, రాంటెంకి ప్రతాప్, బల్వంత్, కిషన్, మనోజ్, సురేందర్, స్వాగత్, చింటు తదితరులు పాల్గొన్నారు.