
విద్యా బోధన మెరుగుపర్చుకోవాలి
● డీఈవో యాదయ్య
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయులు తమ వి ద్యా బోధనను మెరుగుపర్చుకోవాలని డీఈ వో యాదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. డీఈవో మాట్లాడుతూ టీచర్లు క్రమం తప్పకుండా ఐదురోజులపాటు శిక్షణకు హాజరు కావాలన్నారు. జి ల్లా రిసోర్స్‌పర్సన్లు చెప్పే అంశాలను పాఠశాలల్లో కొనసాగించాలని సూచించారు. అభ్యసన సామగ్రిని వినియోగించి బోధన చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఐ ద్వారా విద్యాబోధన ప్రారంభిస్తున్నామ ని, ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, అబిద్ అలీ, ఎంఈవో సుభాష్ పాల్గొన్నారు.