
16న పెంచికల్‌పేట్‌కు మంత్రి ‘పొంగులేటి’ రాక
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ మండలానికి ఈ నెల 16న రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రానున్నారని ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. మండల కేంద్రంలో సభాస్థలిని బుధవారం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూభారతి రె వెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్ ప్రా జెక్టు కింద పెంచికల్‌పేట్ మండలాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ నెల 16న మంత్రి స్థానిక రైతులతో ముచ్చటిస్తారని తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు హెలిప్యాడ్, సభాస్థలాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు పరిశీలించారు.