
అకాల వర్షం.. అన్నదాతలకు కష్టం
దహెగాం/పెంచికల్‌పేట్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దహెగాం, పెంచికల్‌పేట్‌తోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వరిధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పారు. వర్షం తగ్గిన తర్వాత తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబోశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే రెక్కల కష్టం వృథా అవుతుందని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరారు. కాంటా పూర్తయినా అధికారులు మిల్లులకు తరలించడం లేదని ఆరోపించారు.

అకాల వర్షం.. అన్నదాతలకు కష్టం