
రహదారుల అభివృద్ధికి కృషి
రెబ్బెన(ఆసిఫాబాద్): మారుమూల గ్రామాల్లో రహదారుల సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. రెబ్బెన మండలం కొమురవెళ్లి నుంచి కిష్టాపూర్ వరకు రూ.2కోట్లతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులను సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడా రు. జిల్లాలో రహదారుల నిర్మాణానికి రూ.10కోట్ల సీఆర్‌ఆర్ నిధులు కేటాయించామని తెలిపారు. కొమురవెళ్లి నుంచి రంగాపూర్ మీదుగా కిష్టాపూర్ వరకు రూ.2కోట్లతో బీటీరోడ్డు నిర్మిస్తున్నామన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో రూ.44 కోట్ల వ్యయంతో ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ప్రత్యేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం నిర్మించడం సంతోషమన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు.
గుండెల్లో పెట్టుకునేలా పనిచేయాలి
చింతలమానెపల్లి: ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజించేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. చింతలమానెపల్లి మండలం డ బ్బాలో సోమవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ స్థానికంగా ప్రజ ల పోడు సమస్యను పరిష్కరించేందుకు అధికారులు పనిచేయాలన్నారు. ప్రజలపై జులుం చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఆదివాసీల అభి వృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆయా కార్య క్రమాల్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఏఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ రామానుజం, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, డీఆర్‌డీవో దత్తారాం, ఎఫ్‌డీవో సుశాంత్ బొగాడె, తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో శంకరమ్మ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి సీతక్క
సొంతింటి కల సాకారమే లక్ష్యం
కౌటాల: రాష్ట్రంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, వారి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కౌటాలలో సోమవారం రాత్రి ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలు దశాబ్ద కాలంగా సొంతిళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వ సూచనల మేరకు నిర్మించుకోవాలన్నారు. విడతలవారీగా నిధులు మంజూరు చేస్తామన్నారు. కౌటాల మండల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఎఫ్‌డీవో సుశాంత్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, అధికారులు వేణుగోపాల్, పుష్పలత, రమేశ్, బద్రుద్దీన్, పార్టీ మండల కన్వీనర్లు నికోడే గంగారాం, ఉమామహేశ్, తదితరులు పాల్గొన్నారు. కాగా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించాల్సిన కార్యక్రమం రాత్రి 10 గంటలకు ప్రారంభించారు. దీంతో పోలీసులకు గంటలపాటు నిరీక్షణ తప్పలేదు.

రహదారుల అభివృద్ధికి కృషి