
టీచర్లకు వేసవి శిక్షణ
● నేటి నుంచి ఈ నెల 31 వరకు..
హాజరు కావాలి
జిల్లాలో ఈ నెల 13 నుంచి 31 వరకు ని ర్వహిస్తున్న శిక్షణ కా ర్యక్రమానికి ఉపాధ్యాయులు టైం టే బుల్ వారీగా తప్పని సరిగా హజరు కావాలి. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలి.
– యాదయ్య, డీఈవో
సమయపాలన పాటించాలి
ఉపాధ్యాయులు స మయపాలన పాటించాలి. ప్రతీ సబ్జెక్టుకు కాంప్లెక్స్ హెచ్‌ఎంలను సెంటర్ ఇన్‌చార్జీలుగా నియమించాం. ఉదయం 9:30 గంటల్లోపు వచ్చి, జియోకార్డినల్ ద్వారా తమ మొబైల్ నుంచి హాజరు నమోదు చేసుకోవాలి.
– శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్టినేటర్
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు జిల్లాలో అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి శిక్షణ అందించనున్నారు. ఈ నెల 31 వరకు కొనసాగే వేసవి శిక్షణ కార్యక్రమం కోసం విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 13 నుంచి 17 వరకు మొదటి దశ, ఈ నెల 20 నుంచి 24 వరకు రెండో దశ, ఈ నెల 27 నుంచి 31 వరకు మూడో దశలో శిక్షణ అందించనున్నారు. డిజిటల్ విద్య, కంప్యూటర్ ద్వారా ఏఐ ఆ ధారిత విద్యాబోధన, లీడర్‌షిప్ లక్షణాల పెంపుద ల, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబో ధన, సబ్జెక్టు విద్యా బోధన, జీవన నైపుణ్యాలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ బోర్డు(ఐఎఫ్‌బీ) వినియో గం, 2025– 26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఎలా బోధించాలి, కనీస సామర్థ్యాలు పెంపు, విద్యా ప్రమాణాలు ఎలా సాధించాలి, ప్రాథమిక స్థాయి నుంచి కనీస సామర్థ్యాలు సాధించేలా కార్యాచరణ రూపకల్పన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
వివిధ స్థాయిల్లో..
జిల్లాస్థాయిలో భాగంగా ఈ నెల 13 నుంచి 17 వరకు ఒక్కో జిల్లా రిసోర్స్‌పర్సన్ ప్రతీ సబ్జెక్టుకు నలుగురు చొప్పన స్కూల్ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, గెజిటెడ్ హెచ్‌ఎంలు, కేజీబీవీల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత శిక్షణ తీసుకున్నవారు మండలస్థాయిలో ఈ నెల 20 నుంచి 24 వరకు, 27 నుంచి 31 వరకు ఎంఈవోల ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తారు. 130 గణితం సబ్జెక్టు ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ కొనసాగనుంది. జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్‌లో 100 వంద మందికి, తెలంగాణ మోడల్ స్కూల్‌లో సాంఘిక శాస్త్రం 114 మందికి, బాలికలు ఉన్నత పాఠశాలలో 120 మండల స్థాయి రిసోర్స్‌పర్సన్లకు, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రత్యేక విద్య 80 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే వంద మంది సైన్స్ టీచర్లు, 106 మంది హిందీ, 109 మంది ఫిజికల్ సైన్స్, 138 మంది తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ అందించనున్నారు.

టీచర్లకు వేసవి శిక్షణ