
హద్దురాళ్ల తొలగింపు
రెబ్బెన: ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వేస్తే చర్యలు తప్పవని మండల పంచాయతీ అధికారి వాసుదేవ్ అన్నారు. కొండపల్లి శివారులోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్‌లో ఆదివారం పంచాయతీ అధికారులు హద్దురాళ్లను తొలగించారు. ఆయన మాట్లాడుతూ డీటీసీపీ, గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దన్నారు. డీటీసీపీ ద్వారా మాత్రమే లేఅవుట్లను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.