మొక్కజొన్న నిల్వలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న నిల్వలకు భరోసా

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి క్రయవిక్రయాల కోసం నిర్మిస్తున్న నాలుగు షెడ్లను మొక్కజొన్నల నిల్వలకు వినియోగిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ కేంద్రాల్లో కాంటాలు పూర్తయినా తరలింపులో జాప్యమై రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతలోనే అకాల వర్షాల కారణంగా నష్టం జరుగుతోంది. అయితే, మార్క్‌ఫెడ్‌కు వివిధ ప్రాంతాల్లో గోదాములు ఉన్నా అవన్నీ నిండి ఉన్నాయి. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్‌ దివాకర్‌ టీ.ఎస్‌. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నూతనంగా నిర్మించిన నాలుగు షెడ్లను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఈమేరకు వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లారీల్లో తరలిస్తున్నారు. ఇక్కడ నాలుగు షెడ్లలో ఏడు లక్షల బస్తాల మొక్కజొన్న(40 వేల మెట్రిక్‌ టన్నులు)లు నిల్వ చేసే అవకాశముంది.

ఖమ్మం మార్కెట్‌లోని కొత్త షెడ్లలోకి

సరుకులు

Advertisement
 
Advertisement
Advertisement