ఖమ్మం సహకారనగర్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి తెలిపారు. సోమవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు జారీ చేయడమే కాక, కేంద్రాల్లో అవసరం మేర టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర హాజరుకాగా.. అనంతరం అధికారులతో సమావేశమైన కొనుగోళ్లలో సూచనలు, కేంద్రాల్లో ఏర్పాట్లపై సూచనలు చేశారు. రైతులు గన్నీ బ్యాగులు తీసుకువస్తే వాటికి కూడా ప్రభుత్వం నగదు చెల్లిస్తుందనే విషయాన్ని వివరించాలని తెలిపారు. సీపీఓ శ్రీనివాస్, డీఆర్‌డీఓ శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో డీసీఎస్‌ఓ తనిఖీలు
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడమే కాక కాంటా పూర్తికాగానే కేటాయించిన మిల్లులకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ సూచించారు. జిల్లాలోని మధిర, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో పలు కొనుగోలు కేంద్రాలు, మిల్లులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీఎస్‌ఓ మాట్లాడుతూ అవసరమైన గన్నీ బస్తాలు సమకూర్చుకోవడమే కాక ధాన్యం తరలింపునకు లారీల కొరత రాకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు క్రమపద్ధతి పాటిస్తూ, కాంటా కాగానే నిర్దేశిత మిల్లులకు తరలించాలని తెలిపారు. ఆయన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.


