నూతన షెడ్లలో మొక్కజొన్న నిల్వలు | - | Sakshi
Sakshi News home page

నూతన షెడ్లలో మొక్కజొన్న నిల్వలు

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

ఖమ్మంవ్యవసాయం: రైతు ప్రయోజనాల దృష్ట్యా నూతన నిర్మాణాలను వినియోగిస్తున్నామని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ యరగర్ల హన్మంతరావు తెలిపారు. వైస్‌ చైర్మన్‌ తల్లాడ రమేష్‌తో కలిసి సోమవారం ఆయన మాట్లాడారు. మిర్చి క్రయవిక్రయాల్లో ఇబ్బందులను అధిగమించేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.155 కోట్లు కేటాయించగా 15.29 ఎకరాల్లో అధునాతన యార్డు నిర్మాణమవుతోందని తెలిపారు. తొలి దశలో రూ.114 కోట్లతో ఏడు షెడ్లు నిర్మిస్తున్నామని స్తూ, ఇందులో ఆరింటిని మార్కెట్‌ కార్యకలాపాలకు, మరో షెడ్డును రైతుల విశ్రాంతి, కార్మికుల కోసం కేటాయించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే, ధరల వివరాలు ప్రదర్శించేలా డిజిటల్‌ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాచేయడమే కాక వాటర్‌ ప్లాంట్లు, టాయిలెట్‌ బ్లాకులు, ఫైర్‌ వ్యవస్థ, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ ఉంటుందని వెల్లడించారు. కాగా, యాసంగి మొక్కజొన్న నిల్వలకు ఇబ్బంది రాకుండా మంత్రి తుమ్మల, కలెక్టర్‌ సూచనలతో మార్కెట్‌లోని నాలుగు నూతన షెడ్లు కేటాయించామని చైర్మన్‌ తెలిపారు. మార్కెట్‌ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌తో పాటు డైరెక్టర్లు రెంటాల ప్రసాద్‌, బోజెడ్ల సత్యనారాయణ, వెనిగండ్ల బాబూరావు, చెరుకూరి సీతారాములు, బాణోత్‌ బీమా, మొర్రిమేకల నాగేశ్వరరావు, బాణత్‌ రమేష్‌, అంగడాల నర్సింహారావు, షేక్‌ లతీఫ్‌, చిట్టిబాబు పాల్గొన్నారు.

ఖమ్మం మార్కెట్‌ చైర్మన్‌ హన్మంతరావు

Advertisement
 
Advertisement
Advertisement