మంత్రులున్నా.. రైతుల కంట కన్నీరే | - | Sakshi
Sakshi News home page

మంత్రులున్నా.. రైతుల కంట కన్నీరే

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

కొణిజర్ల: ముగ్గురు ప్రధాన శాఖల మంత్రులు ఉన్న జిల్లాలో రైతులు కంటతడి పెట్టే పరిస్థితి నెలకొందని మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందరావు పేర్కొన్నారు. సకాలంలో మక్కలు, ధాన్యం కొనుగోళ్లు జరగక, కాంటా వేసినా తరలించక అకాల వర్షంతో నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇకనైనా స్పందించి 48 గంటల్లో కొనుగోళ్లు పూర్తి చేయకపోతే మక్కలను కలెక్టరేట్‌ లేదా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయానికి తరలిస్తామని హెచ్చరించారు. కొణిజర్ల మండలం తనికెళ్లలో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఏఓ బాలాజీ, సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లుతో ఎంపీ ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు.

తెలంగాణలోనూ కాషాయ జెండా

ఎగురవేస్తాం

ఖమ్మం మామిళ్లగూడెం: దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో విస్తరించిన ఎన్‌డీఏ త్వరలో తెలంగాణలోనూ జెండా ఎగురవేయడం ఖాయమని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడంతో బీజేపీ అధికారం వచ్చిందన్నారు. ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నందున జయప్రదం చేయాలని ఎంపీ కోరారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, నాయకులు ఉదయ్‌ప్రతాప్‌, వాకధాని పుల్లారావుయాదవ్‌, రుద్ర ప్రతాప్‌, నాయుడు రాఘవరావు, చిలుకూరు రమేష్‌, ఈ.వీ.రమేష్‌, వక్కలంక సుబ్రహ్మణ్యం, పమ్మి అనిత, విజయ రాజు, మందడం సుబ్బారావు, మారుతి బాబురావు, బొబ్బ భాగ్యరెడ్డి, బండారు నరేష్‌ బాబు, కవిడ మురళి, బండారు సత్యనారాయణ పాల్గొన్నారు.

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement