గర్వం పనికి రాదు.. | - | Sakshi
Sakshi News home page

గర్వం పనికి రాదు..

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

ఈ వేసవి సెలవుల్లో సత్తుపల్లిలోని మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చా. ప్రతిరోజు రాత్రి భోజనాలయ్యాక నాతో పాటు అన్న పార్ధు, ఇంకొందరు స్నేహితులకు మా అమ్మమ్మ కథ చెబుతుంది. తాజాగా చెప్పిన కథే ఇది. అయితే, ఈ కథ చెప్పే ముందే మా అమ్మమ్మ ఇందులోని నీతిని పాటించాలనే మాట తీసుకుంది. అందుకే మాట ఇచ్చాకే కథ విన్నాం. ఈ కథేమిటో మీరూ చదవండి..

సత్తుపల్లిటౌన్‌: ఒక రోజు సాయత్రం వేళ ఒక మిణుగురు పురుగు తన వెలుగుని చూసి గర్వపడి ప్రపంచానికి నేనే వెలుగును ఇస్తున్నాను అనుకుందంటా. ఇంతలో నక్షత్రాలు వచ్చేసరికి మిణుగురు వెలుగు మాయమైంది. అప్పుడు నక్షత్రాలు మా కాంతితోనే ప్రపంచానికి వెలుగు వస్తుందని గర్వపడ్డాయట. ఆ కాసేపటికే చంద్రుడు వచ్చాడు. అంతలో నక్షత్రాల వెలుగు మాయమైంది. అప్పుడు చంద్రుడు కూడా నా వెలుగే ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుందని బడాయి పోయాడట. సరే తెల్లవారింది. సూర్యుడు రానే వచ్చాడు. సూర్యుడు రావడంతో చంద్రుని వెన్నెల మాయమై పోయింది.

అమ్మమ్మ

చెప్పిన

నీతి కథ

Advertisement
 
Advertisement
Advertisement