ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట పట్టాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన పార్టీ శాఖా కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు జీవన స్థితి దిగజారిపోతోందని తెలిపారు. అంతేకాక రైతులు తాంగం పండించిన పంటలకు ధరలు లేవని, కొనుగోలు చేసే దిక్కులేదని అన్నారు. ప్రభుత్వాల విధానాలతోనే అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక వాణిజ్య వినియోగ గ్యాస్‌ ధరలను భారీగా పెంచడంతో హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. అంతేకాక రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సీ.వై.పుల్లయ్య, ఆవుల అశోక్‌, బందెల వెంకయ్య, శివలింగం, వెంకటరెడ్డి, ఝాన్సీ, శిరోమణి, శోభ, గంటా శ్రీను, లాల్మియా, ఎం.నాగేశ్వరరావు, కె.నాగేశ్వరరావు, కే శ్రీను, లక్ష్మణ్‌, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

Advertisement
 
Advertisement
Advertisement