ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కింది.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కింది..

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

● మీరు చేసిన అభివృద్ధి, కాంగ్రెస్‌ మోసాలను వివరించండి ● బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల సన్మానంలో మాజీ మంత్రి పువ్వాడ

● మీరు చేసిన అభివృద్ధి, కాంగ్రెస్‌ మోసాలను వివరించండి ● బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల సన్మానంలో మాజీ మంత్రి పువ్వాడ

ఖమ్మంమయూరిసెంటర్‌: కార్పొరేటర్లుగా గెలిచి ప్రజలకు సేవ చేసే అదృష్టం లభించడాన్ని ప్రజాప్రస్తానంలో కీలక మైలురాయిగా భావించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. ఖమ్మం కార్పొరేషన్‌ పాలకవర్గం గడువు ఈ నెల 7వ తేదీతో ముగియనుండగా, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను శనివారం పువ్వాడ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీకాలం ముగిసినా ప్రజల్లోనే ఉంటూ చేసిన అభివృద్ధిని వివరించడమే కాక కాంగ్రెస్‌ వచ్చాక జరిగిన మోసాలను వివరించాలని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కార్పొరేటర్లుగా గెలిచి ప్రజలకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. కాగా, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిపక్వత లేని వాళ్లు వెళ్లిపోగా, రాజకీయ అనుభవం ఉన్నవారు తనతో కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న వారికి పార్టీ నుంచి టికెట్లు ఖాయం చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సైతం కష్టపడి అత్యధిక స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. అనంతరం కర్నాటి కృష్ణ, షేక్‌ మక్బూల్‌, దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, శీలంశెట్టి రమావీరభద్రం, తోట గోవిందమ్మ రామారావు, మాటేటి అరుణ నాగేశ్వరరావు, బిక్కసాని ప్రశాంతిలక్ష్మి జస్వంత్‌, పసుమర్తి రామ్మోహన్‌, బుర్రి వెంకట్‌కుమార్‌, బుడిగం శ్రీనివాస్‌, ముక్కాల కమల, పల్లా రోజ్లీనా, పగడాల శ్రీవిద్య తదితరులను సన్మానించారు. డీసీసీబీ, మార్కెట్‌ మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణతో పాటు పగడాల నాగరాజు, ఖమర్‌, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, అమరగాని వెంకన్న, మెంతుల శ్రీశైలం, కొత్త వెంకటేశ్వరరావు, కొల్లు పద్మ, షకీనా, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement