చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేకాలనీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కాంపెల్లి శేషగిరిరావు(38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన భార్య వసంత, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... శేషగిరిరావు కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరు కుటుంబాలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. ఈక్రమాన గ్రామంలో నిరుపయోగంగా ఉంటున్న ఇంట్లో రేకుల షెడ్డు కడ్డీకి విద్యుత్ వైర్‌తో శేషగిరిరావు ఉరి వేసుకున్నాడని గురువారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పరిశీలించగా రేకుల షెడ్డు ఆరు అడుగుల ఎత్తే ఉండడం, వైర్లు పూర్తిగా బిగుసుకుపోకపోవడం, మృతదేహం సగం నేలను తాకి ఉండడంతో కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుటుంబంతో గొడవ ఉన్న వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శేషగిరిరావు భార్య వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై వీరేందర్ ఆధ్వర్యాన దర్యాప్తు చేపట్టారు. ఆయన మృతదేహం వద్ద మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
రఘునాధపాలెం: మండలంలోని వేపకుంటలో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు గురువారం తనిఖీ చేపట్టారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యాన చేపట్టిన తనిఖీల్లో నలుగురు పట్టుబడగా, మరో నలుగురు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.7,140 నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
హత్యేనని కుటుంబీకుల ఆరోపణ


